నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన బీజేపీ నేత‌లు.. నియామక పత్రాలు అందజేత‌

హైద‌రాబాద్: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిన సంద‌ర్భంగా మైనారిటీ సంక్షేమం కోసం ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా బ్రోచర్ ద్వారా విడు‌దల చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో గురువారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.‌ అనంత‌రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా కె శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శిగా డాక్టర్ ఉమా శంకర్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియామకం జరిగిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధి లకు నియామక పత్రాలను అందజేశారు.

Latest Updates