రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

కరీంనగర్ నుంచి జగిత్యాల, వేములవాడ నుంచి కోరుట్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ నేతలు బాలరాజు నూనె, ఎం.సత్యనారాయణతో కలిసి గడ్కరీకి వినతిపత్రం ఇచ్చారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు చిన్నగా ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ రోడ్డు విస్తరణ చేపట్టి నేషనల్ హైవే 563కు కలపాలని కోరారు. వేములవాడ నుంచి  కోరుట్ల వరకు 50 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి నేషనల్ హైవే 63కు కలపాలని, వేములవాడ వచ్చే భక్తులకు ఇబ్బంది తొలగిపోతుందన్నారు.

Latest Updates