పరిక్రమ యాత్ర చేపట్టిన MP బండి సంజయ్

కొండగట్టు ఆలయ అభివృద్ధిని కాంక్షిస్తూ.. హనుమాన్ పరిక్రమ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నగరంలోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధితో పాటు, ధర్మరక్షణ కోసం ఆంజనేయ స్వామి తనను గెలిపించాలని గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చేందుకు ఈ యాత్ర చేపట్టానన్నారు సంజయ్. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్టు చెప్పారు. తనది కేవలం ధార్మిక యాత్ర మాత్రమేనని..దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్ధేశ్యాలు లేవన్నారు. 37 కిలోమీటర్ల పాదయాత్ర ఇవాళ రాత్రి వరకు పూర్తి కానుంది.

Latest Updates