బంజారా సంఘం.. కేసీఆర్‌‌ను, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టాలి

బంజారా సంఘం.. కేసీఆర్‌‌ను, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టాలి

బంజారా సంఘం.. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. లంబాడా గ్రామాలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్.. నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న చాలామందిని జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. లంబాడాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తోడ్పడుతోందని చెప్పారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్.. ఏడేళ్లయినా ఆ హామీ నెరవేర్చలేదన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి.. హామీలు అమలు కావని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బంజారా ఉత్సవ్ లో పాల్గొన్నారు నేతలు.