కేసీఆర్ ఎన్ని యాగాలు చేసిన పాపాలు పోవు

తెలంగాణకు పట్టిన వాస్తుదోషం కేసీఆర్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా… ఆయన చేసిన పాపాలు పోవని సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు.

‘అమరవీరుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుంది. నాగార్జున సాగర్‌లో బీజేపీని ఎదుర్కోవడం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్‌లోనూ వస్తాయి. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదు. ఉద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌తో బీజేపీ యుద్ధం చేస్తుంది. నాగార్జున సాగర్‌కు టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. నాగార్జున సాగర్ ప్రజలు తిప్పికొడతారు. నాగార్జున సాగర్‌లో గెలువు బీజేపీదే’ అని ఆయన అన్నారు.

For More News..

ఎల్బీనగర్‌లో గోసడక్ బంద్.. పోలీసుల ఓవర్ యాక్షన్..

మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మీటింగ్

సిడ్నీ టెస్టులో ఆసీస్ 338 పరుగులకు ఆలౌట్

Latest Updates