కొడుకు వల్ల కావట్లేదని.. తండ్రి స్టార్ట్ చేస్తుండు

Bandi Sanjay says KCR is conspiring to postpone GHMC elections 2020

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరారం రోడ్ షోలో పాల్గొన్నారు బండి సంజయ్. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను కొడుకు అడ్డుకునే ప్రయత్నం విఫలం అయిందని.. బీజేపీని ఆపడం కొడుకు వల్లకావట్లేదని.. కేసీఆరే రంగంలోకి దిగుతున్నాడని అన్నారు బండి సంజయ్. దుబ్బాక ఎన్నికలకు ముందు వాడిన స్తంటే.. కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు వాడాలని చూస్తున్నాడని ఆరోపించాడు బండి సంజయ్.

దుబ్బాక ఎన్నికలకు ముందు కూడా ఇలాగే శాంతి భద్రతల సమస్యను స్పృష్టిస్తున్నారు అని ప్రచారం చేశారు కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారని అన్నారు బండి సంజయ్. భాగ్యనగరంలో కూడా దుబ్బాక రిజల్ట్ వస్తాడని అన్నారు బండి సంజయ్. శాంతి భద్రతల పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వెయ్యాలని కేసీఆర్ చూస్తున్నాడు.. అలాంటి ప్రయత్నాలు చేస్తే బీజేపీ చూస్తూ ఉరుకోదని అన్నారు. ఎన్నికల వాయిదా కుట్రకు అధికారులు సహకరిస్తే.. వారే బాధ్యత వహించాల్సి వస్తదని అన్నారు బండి సంజయ్.

Latest Updates