‘కేసీఆర్ 8వ నిజాం.. బడా చోర్..’

సీఎం పై బండి సంజ‌య్ ఘాటు వ్యాఖ్య‌లు

బడా చోర్ కేసీఆర్ కారణంగా తెలంగాణ పండుగ రోజైన సెప్టెంబర్ 17 (విమోచ‌న దినోత్స‌వం)ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023 లో కేసీఆర్ ఊక దంపుడు మాటలు బంద్ అవుతాయని అన్నారు. కేసీఆర్ నమ్మొద్దని, బీజేపీ ని నమ్మండి.. బీజేపీ కి మద్దతు ఇవ్వండ‌ని పిలుపునిచ్చారు సంజ‌య్.

తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు సంజ‌య్ ప‌లు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం సిద్దిపేట జిల్లాలోని భైరాన్ పల్లిలో సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భైరన్ పల్లి అమర వీరుల గడ్డ అని.. ఈ గడ్డకు వస్తే పౌరుషం పుడుతుందని అన్నారు. ఈ గడ్డ మీద తానెందుకు పుట్టలేదు అనుకుంటున్నాన‌ని అన్నారు.

‘భైరన్ పల్లి ని అభివృద్ధి చేస్తాన‌ని చెప్పి చోర్ కేసీఆర్ మర్చిపోయిండు … మాయమాటలు చెప్పే
కేసీఆర్ మీ ప్రాంతానికి వస్తే ఉరికించి కొట్టండి..’అని అన్నారు సంజ‌య్. కేసీఆర్ బ‌య‌ట‌కు వస్తే తెలంగాణ పల్లెల్లోని ప్ర‌జ‌లు రాళ్లతో కొడతారని భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ గ్రామాల్లోకి రావడం లేదన్నారు.

ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ , కేటిఆర్, కేసీఆర్ బిడ్డ లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్ర‌శ్నించారు సంజ‌య్.కేసీఆర్ ది ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట అని అన్నారు. రోజుకో వేషం, పూటకోమాటతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలను చంపిన నిజాం ను గొప్పోడు అంటూ కేసీఆర్ పొగుడుతున్నాడని.. కేసీఆర్ 8వ నిజాం అని అన్నారు

Latest Updates