కరీంనగర్ : గులాబీ తోటలో వికసించిన కమలం ‘బండి సంజయ్’

bandi-sanjay-wins-in-karimangar-loksabha-segment

కరీంనగర్ లోక్ సభ స్థానం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సెగ్మెంట్. కేసీఆర్ కు ఎంపీగా హ్యాట్రిక్ విక్టరీ అందించిన కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బి. వినోద్ గెలిచారు. మళ్లీ ఆయన గెలుపు ఖాయం అనుకున్నారు. ఐతే… అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కరీంనగర్ ఓటర్ మార్పు చూపించాడు. ఎంపీగా వినోద్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పటికీ… జనం ఆ మాటలు ఖాతరు చేయలేదు. బండి సంజయ్ కు భారీ ఆధిక్యం కట్టబెట్టి… సంచలన తీర్పు ఇచ్చారు.

టీఆర్ఎస్ ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. ఆ తర్వాత 1998, 99ల్లో బీజేపీ అభ్యర్థిగా సీహెచ్. విద్యాసాగర్ రావు గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడినుంచే 2004, 2006, 2008ల్లో 3 సార్లు గెలిచారు. 2009లో పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఈ సీటును కైవసం చేసుకుంది. బోయినపల్లి వినోద్ కుమార్.. 2019లోనూ గెలుస్తారన్న అంచనాలుండేవి. ఐతే.. ఆ అంచనాలను బండి సంజయ్ పటాపంచలు చేశారు.

యూత్ , హిందూత్వం, బీజేపీ వాదం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్.. ఇవే బండి సంజయ్ ప్లస్ పాయింట్స్ గా బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కారణంగానే.. ఎన్నడూ బీజేపీ వైపు చూడని ఇతర పార్టీల ఓటు బ్యాంక్ కూడా ఈసారి కమలం వైపు తిరిగిందని చెప్పుకుంటున్నారు.

బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్

 • పేరు: బండి సంజయ్ కుమార్
 • పుట్టిన తేదీ:11-7-1971
 • తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
 • మతం: హిందువు
 • కులం: మున్నూరుకాపు,(బి.సి-‘డి’)
 • భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)
 • పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
 • ప్రస్తుత బాధ్యత: కరీంనగర్ నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
 • గతంలో చేపట్టిన బాధ్యతలు :
 • చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడు
 • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
 • ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో 1994-1999;1999-2003 రెండుసార్లు డైరెక్టర్
 • ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా పనిచేశారు
 • భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.
 • ఎల్.కె అద్వానీ చేసిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా బాధ్యతలు నిర్వర్తించారు.
 • కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా హ్యాట్రిక్
 • 2014 కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా 52,000 వేల ఓట్లతో రెండోస్థానం
 • 2018 కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో 66,009 ఓట్ల తేడాతో ఓటమి.
 • 2018లో రాష్ట్రంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సంపాదించిన బండి సంజయ్
 • 2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలుపు!

Latest Updates