కేసీఆర్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తా..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. బంజారహిల్స్ వద్ద బీజేపీ స్టేట్ చీఫ్   బండి సంజయ్ ని  అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు .ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్..త్వరలోనే కెసిఆర్ ను ఫామ్ హౌస్ కే శాశ్వతంగా పరిమితం చేస్తామన్నారు.  బిజెపి అసెంబ్లీ ముట్టడి విజయవంతమయిందన్నారు.  తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే.. నిజాం రజాకార్ల వారసుల పక్షాన కెసిఆర్ ఉండన్నారు.  బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారని అసెంబ్లీ ముట్టడి విజయంతో ఋజువైందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో బీజేపీ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.  అక్రమ అరెస్టులు కెసిఆర్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. సాయంత్రం వరకు అసెంబ్లీ ముట్టడి కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి బిజెపి నాయకులు కార్యకర్తలు తరలివస్తూనే ఉంటారన్నారు. బిజెపి కార్యకర్తల శక్తిని కెసిఆర్ ప్రభుత్వం తట్టుకోలేదన్నారు.

బండి సంజయ్ ను  అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఎన్ని నిర్బంధాలు విధించినా కార్యకర్తలు చేదించుకొని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారని  తెలిపింది.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ లను అసెంబ్లీ వద్ద అరెస్టు చేశారు.

NSD ఛైర్మన్ గా ప్రముఖ నటుడు పరేష్ రావల్

నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం  చేసుకుంటారు?

 

Latest Updates