అర్నాబ్ గోస్వామిపై కేసు

ముంబై: మత విద్వేషాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదైంది. కిందటి నెలలో వలస కార్మికుల నిరసన ఘటన విషయంలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు గోస్వామి ప్రయత్నించారన్న పిటిషనర్ ఇర్ఫాన్ అబూబకర్ షేక్ కంప్లైంట్ మేరకు పైడోనీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 14 న జరిగిన వలస కూలీల నిరసనకు బాంద్రాలోని మసీదుకు ఎలాంటి సంబంధం లేదని, అయినా.. ఆ నిరసన కార్యక్రమానికి మసీదుకు సంబంధాలు అంటగట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా గోస్వామి తన టీవీ షోలో కామెంట్ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ‘‘లాక్​డౌన్ సమయంలో తమ సొంతూళ్లకు వెళ్లడానికి రవాణా ఏర్పాట్లు చేయాలంటూ బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసనకు దిగారు. ఆ స్టేషన్ కు దగ్గరలోని మసీదు వద్ద ఖాళీ ప్లేస్ లో చాలా మంది గుమిగూడారు. దీనిని చూపించి ఆర్నాబ్ ఉద్దేశపూర్వకంగా నగరంలో మత ఘర్షణలు సృష్టించేందుకే మసీదు వద్ద కుట్ర జరుగుతోందంటూ టీవీ షోలో హైలెట్ చేశారు. నిజానికి ఆ కూలీలకు మసీదుకు ఎలాంటి సంబంధం లేదు”అని పిటిషనర్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

 

Latest Updates