కరోనా కక్కుర్తి : 52వేలకు లిక్కర్ కొనుగోలు చేసిన మందుబాబు

మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అంటూ పాటలు పాడుకుంటున్నారు కొంతమంది మందుబాబులు

లాక్ డౌన్ లో దాదాపుగా 40 రోజుల పాటు మ‌ద్యం దొరక్క‌పోయే సరికి నాలుక ఎండిపోయిన‌ట్ల‌యింది. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో మద్యంపై ఆంక్షలు సడలించడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

క్రియేటివిటీని వెలిక్కి తీస్తున్న మందుబాబులు

వైన్ షాపులు ఓపెన్ చేస్తున్నారనే ప్రకటన రావడంతో 24గంటలు మందే వైన్ షాపుల వద్దకు చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత మందు తాగుతున్నాం అన్న ఆనందంలో తమలో ఉన్న క్రియేటీవిటీని బయటకు తీస్తున్నారు  చెప్పులు లేకుండా గుళ్లోకి వెళ్లినట్లు, వైన్ షాపుల్లోకి వెళ్లడం, క్యూలైన్లో నిలబడి వైన్ షాపుకి హారతి కర్పూరం ఇవ్వడం ఒకటేమిటీ చాలా ఉన్నాయి. మీరూ చూసే ఉంటారు.

 వైన్ షాపులు మూసేస్తారేమో

లాక్ డౌన్ లో వైన్ షాపులు ఓపెన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మద్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నా మందుబాబులు మాత్రం వాళ్లకు నచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. దీంతో వైన్ షాపులు క్లోజ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే ముందస్తు జాగ్రత్తలతో బెంగళూరుకు చెందిన పలువురు భారీ  ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.మాస్క్ కొనుక్కోమంటే కొనుక్కుంటారో లేదో తెలియదు కానీ లిక్కర్ కొనుగోలు ‌కు ఎగబడుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.52వేల లిక్కర్ కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

Latest Updates