బీజేపీ నయా స్ట్రాటెజీ: 28 ఏళ్లకే లోక్ సభ ఎన్నికల బరిలో..

బెంగళూరు సౌత్ నుంచి 28ఏళ్ల యంగ్ అభ్యర్థిని లోక్ సభ బరిలో నిలిపింది బీజేపీ. తేజస్వి సూర్య అనే యంగ్ లాయర్ మొదటి నుంచి బీజేపీ లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఇది వరకూ సూర్య ఏబీవీపీలో పనిచేశారు.  బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి  అనంత్ కుమార్ భార్య తేజస్విణీని బెంగళూరు సౌత్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని అంతా భావించారు. కానీ.. బీజేపీ  మాత్రం సూర్యను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్థానంలో బీజేపీ క్యాడర్ బలంగా ఉంది.

బీజేపీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు తేజస్వి సూర్య. ఈ మధ్య  బీజేపీ చీఫ్ అమిత్ షాతో జరిగిన భేటీ తనకు ఎంతో స్పూర్తినిచ్చిందని చెప్పారు. ఈ స్పూర్తితో తాను మరింత  పనిచేస్తానని.. పార్టీ విజయానికి పాటుపడతానని చెప్పారు.

Latest Updates