నదిని ఈదుకుంటూ భారత్ కు వచ్చాడు..!

అస్సాం: భారత్ – బంగ్లాదేశ్‌కు మధ్య ఉన్న కుషియారా నదిని దాటి దేశంలోకి చొరబడ్డాడు ఓ బంగ్లాదేశ్‌ వ్యక్తి. ఈ ఘటన ఆదివారం పొద్దున జరిగింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ దృవీకరించింది. సిల్చర్ కేంద్రంగా పనిచేస్తున్న బీఎస్ఎఫ్ ప్రతినిధి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జెసి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం…   అబ్ధుల్ హక్ ( 30 ) అనే ఓ బంగ్లాదేశ్ పౌరుడు  రెండు దేశాల మధ్య ఉన్న కుషియారా నదిని దాటి ఆదివారం పొద్దున 7.30 నిమిషాలకు బారత బార్డర్ అయిన… అస్సాంలోని కరీంగంజ్‌ ప్రాంతంలో చొరపడ్డాడని తెలిపారు. స్థానికులు అబ్ధుల్ హక్‌ను గుర్తించి బీఎస్ఎప్‌కు సమాచారం అందించారని చెప్పారు  నాయక్.

విచారణలో అబ్ధుల్ హక్ బంగ్లాదేశ్ లోని సునమ్ గంజ్ కు చెందిన వాడని తెలిపినట్టు చెప్పారు నాయక్. అతనికి కరోనా సోకినట్టు చెప్పాడని.. భారత్‌లో వైద్యం చేయించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఉన్న నదిని దాటుకుంటూ వచ్చానని అబ్దుల్ చెప్పాడని చెప్పారు. రెండుదేశాల మధ్య సరిహద్దు ప్రాంతమైన కరీంనగర్ పట్టనానికి నాలుగు కిలోమీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది.

అబ్ధుల్ హక్ ను తిరిగి బంగ్లాదేశ్ బార్డర్ బలగాలకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ అధికారి నాయక్ తెలిపారు. పొద్దున 9గంటలకు రెండు పడవల్లో వచ్చి అబ్ధుల్‌ను తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే అతనికి కరోనా వచ్చిందా లేదా అన్న విషయం తమకు తెలియదని అన్నారు. అతనికి కోవిడ్ వచ్చిందని చెప్పడంతో గ్రామస్థులు భయంతో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనతో భారత్ – బంగ్లా సరిహద్దులలో పెట్రోలింగ్ మరింత పెంచినట్లు చెప్పారు నాయక్.

Latest Updates