నాలుగు భాష‌ల్లో బంజార చరిత్ర‌

నాలుగు భాషల్లో బంజారా చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. మే మొదటివారంలో షూటింగ్‌ ప్రారంభిస్తారు. ఈ సినిమాకు డి.రాజేష్‌ నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడగా.. తాండూరు విఠల్‌ నాయక్‌ నిర్మాత. రవినాయక్‌ రచన చేస్తున్నారు. బంజారా చరిత్ర ఎలా మొదలైంది. వారి పండుగలు ఏ స్థాయిలో జరుపుకుంటారు అనే దానిపై కీలక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. హోలీ, తీజ్‌ పండుగల ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇందులో చూపిస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు, గతంలో బంజారా ఇళ్ళలో వివాహాలు మూడు నెలలు జరిగేవి. ఇవే కాకుండా ఇంకా అనేక విషయాలు ఈ సినిమాలో చూపిస్తున్నామన్నారు. ఆర్టిస్టులుగా కొత్తవారిని ప్రోత్సహిస్తాం” అని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా గుజరాతి, హిందీ, కన్నడ భాషల్లో నిర్మించనున్నట్లు తెలిపారు.

 

Latest Updates