క‌రోనా బారిన ప‌డి బంజారాహిల్స్ ఏఎస్ఐ మృతి

హైద‌రాబాద్: రాష్ట్రంలో కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌తోపాటు మృతుల సంఖ్య‌ కూడా రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా క‌రోనా వైరస్‌ బారిన పడి బంజారాహిల్స్ పీఎస్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ మృతి చెందారు. ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డిన ఆయ‌న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని కొవిడ్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావ్, ఇన్ స్పెక్టర్ కళింగ రావు తదితరులు ప్రేమ్ కుమార్ కు నివాళుల‌ర్పించారు. గ‌త మూడేళ్ల‌ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్.. పోలీసు శాఖ‌లోని వివిధ విభాగాల్లో స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించారన్నారు. పోలీసు శాఖలో అత‌ను సమకాలీకుడు అని, ఎంతో సమర్థవంతమైన అధికారి అని గుర్తు చేసుకున్నారు.

Latest Updates