మైనర్ బాలికపై దాడి.. దంపతుల అరెస్ట్

డబ్బులు దొంగతనం చేసిందనే ఆరోపణలతో  ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై విచక్షణా రహితంగా దాడి చేశారు ఇండియన్ బ్యాంక్ లో పనిచేసే దంపతులు. దొంగతనం చేసిన డబ్బుతో తమ ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాపులో సామాగ్రి కొనుగోలు చేసిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆ దుకాణాన్ని నిర్వహించే మహిళను కూడా చితకబాదారు. ఈ దారుణం కరీంగర్ పట్టణంలోని విద్యానగర్ లో  జరిగింది.

విద్యానగర్ లోని మణిధీప మనోర్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న అనిల్ దంపతులు ఇండియన్ బ్యాంక్ లో పనిచేస్తారు. గత సంవత్సర కాలంగా వీరి ఇంట్లో మహబూబ్ నగర్ జిల్లా గుడి కమలాపూర్ గ్రామానికి  చెందిన బాలిక (16) పనిమనిషిగా చేస్తుంది.  కాగా ఆ బాలిక దొంగతనం చేసిందంటూ ఆమెను కొట్టారు అనిల్ దంపతులు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. జరిగిన గొడవంతా వారికి తెలియజేయడంతో పోలీసులు దంపతులిద్దర్నీ అరెస్ట్ చేశారు.

Bank Employee couple Attacking a Minor Girl in Karimnagar

Latest Updates