మార్చిలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు

మార్చి నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఖాతాదారులు అందుకు అనుగుణంగా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సారి మార్చిలో 5 ఆదివారాలు వస్తున్నాయి. దీనికి తోడు 14న రెండో శనివారం, 28న నాలుగో శనివారం ఉన్నాయి. మార్చి ఫైనాన్సియల్ ఇయర్ ఎండింగ్ కావటంతో 31న బ్యాంకులు మూసేస్తారు. ఇలా మొత్తం 8 హాలిడేస్ వస్తున్నాయి. మార్చిలో 9 లేదా 10 తారీఖున హోలీ పండుగ సెలవు ఉంటుంది. దీనితో 9 హాలిడేస్ అవుతున్నాయి. అయితే మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు ప్రకటించారు. అదే జరిగితే 9 హాలిడేస్‌కు మరో 3 రోజులు జత కానున్నాయి. దీంతో బ్యాంక్ హాలిడేస్ 12 రోజులు అవుతాయి. ఉద్యోగుల సమ్మె ఉంటే మార్చి రెండో వారం మొత్తం బ్యాంకులు మూసేసే ఉంటాయి. 10న హోలీ హాలిడే ఇస్తే 11 నుంచి 13 వరకు స్ట్రైక్, 14 సెకండ్ శాటర్డే, 15న సండే ఉంటుంది. ఈ లెక్కన రెండో వారంలో ఒక్క సోమవారం మినహా మిగతా 6 రోజులు హాలిడేస్ అవుతాయి. సమ్మె లేకుంటే 11 నుంచి 13 తేదీ వరకు బ్యాంక్‌లు యధావిధిగా పనిచేస్తాయి. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు సహా అందరూ బ్యాంక్ సెలవులకు తగినట్లుగా ముందుగానే ప్లాన్ చేసుకోవటం మంచిది.

For More News..

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది

కరోనా ఎఫెక్ట్: ఒక్కో మాస్క్ రూ. 4 లక్షలు

కరెంటు చార్జీల పెంపునకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

Latest Updates