కోల్‌కతాకు ఆరు ప్రాంతాల నుంచి విమానాలు బ్యాన్

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్‌పూర్‌, చెన్నై, అహ్మదాబాద్‌ ప్రాంతాల నుంచి  కోల్‌కతాకు విమానాల సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జూలై 6 నుంచి 19 వరకు ఈ నిషేదం విదించారు. అంతకముందు కరోనా వైరస్‌ హాట్‌ స్పాట్స్ గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల సర్వీసులను నిలిపివేయాలంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(శనివారం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు.

Latest Updates