బాప్‌‌–బేటా.. షేర్‌‌ కహానీ

స్టార్ల వారసుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌‌ ఆత్రుతగా ఎదురు చూడటం కామన్‌‌. అందుకు తగ్గట్లే స్ట్రాంగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ దొరికేదాకా స్టార్లూ ఎదురుచూస్తుంటారు.  బాలీవుడ్‌‌ కింగ్‌‌ఖాన్‌‌ షారుక్‌‌ మాత్రం అలాంటి సందర్భం కోసం చూడట్లేదు. పెద్ద కొడుకు ఆర్యన్‌‌ని హడావుడి లేకుండా గ్లామర్‌‌ ఫీల్డ్‌‌లోకి దించేస్తున్నాడు. అయితే అది యాక్టర్‌‌గా మాత్రం కాదులెండి.  హాలీవుడ్‌‌ బ్లాక్‌‌బస్టర్‌‌ యానిమేటెడ్‌‌ సినిమా ‘ది లయన్‌‌ కింగ్‌‌’ లైవ్‌‌ యాక్షన్‌‌ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌‌ కోసం ఈ తండ్రీ కొడుకులు వాయిస్‌‌ఓవర్‌‌ అందించబోతున్నారు. బాప్‌‌ బడా షేర్‌‌గా.. బేటా చోటా షేర్‌‌గా సందడి చేయబోతున్నారు.

ఈ సినిమాలో ముఫసా క్యారెక్టర్‌‌కి షారుక్‌‌, సింబా పాత్రకు ఆర్యన్‌‌ డబ్బింగ్‌‌ చెప్పబోతున్నారు. అయితే ముందు రోజే ఇండియా–పాక్‌‌ మ్యాచ్‌‌ టైంలో జెర్సీలు ధరించి హింట్‌‌ ఇచ్చారు షారుక్‌‌, ఆర్యన్‌‌లు. తండ్రీ–కొడుకుల అనుబంధానికి అద్దం పట్టే ఎమోషనల్‌‌ కథ  ‘ది లయన్‌‌ కింగ్‌‌’. 1994లో వచ్చిన యానిమేటెడ్‌‌ సిరీస్‌‌ రికార్డు కలెక్షన్లతో సంచనాలు సృష్టించింది. ఇప్పుడు జాన్‌‌ ఫెవ్రీ డైరెక్ట్‌‌ చేసిన ‘ది లయన్‌‌ కింగ్‌‌’ జూలై 19న ఇంగ్లీష్‌‌ తోపాటు హిందీ, తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్‌‌ కానుంది.

Latest Updates