ట్రంప్ కు కష్టమే..ఒబామా వచ్చేస్తున్నాడు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా  ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో   రిపబ్లికన్ పార్టీ తరుపున  ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాటిక్ పార్టీ తరుపున  అధ్యక్ష పదవికి జో బిడెన్ లు పోటీ పడుతున్నారు.  నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం ఆయా పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్ధి జో బిడెన్ ముందజలో ఉన్నారు.

తాజాగా జో బిడెన్ తరుపున అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ బబామా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒబామా ఎన్నికల ప్రచారంపై జోబిడెన్ అధికారికంగా ప్రకటించారు.

అధ్యక్ష ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ జోబిడెన్ ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ కంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు.  అక్టోబర్ 21న పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఒబామా ప్రచారం చేయడం ద్వారా నల్లజాతీయుల్ని ఆకర్షించేలా ఎజెండాను తయారు చేశారు. ప్రస్తుతం ఒబామా ప్రచారంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.

మరోవైపు ఒబామా అమెరికా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ఎన్నికల పందెం. అమెరికన్లు తమ గొంతులను వినిపించాలంటే  ఓటు వేయడమే కాదు. దాని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారు.  మీరు కూడా వారితో పాటు ఓటు వేసేలా సిద్దంగా ఉండాలంటూ  ఒబామా తన  ప్రకటనలో పేర్కొన్నారు.

Latest Updates