దారుణం.. దంతాల కోసం ఏనుగును నిలువునా కోశారు

ఇది అత్యంత అమానుషం. బండబారిన కిరాతకుల అకృత్యానికి సాక్ష్యం. అత్యంత భారీ జంతువైన ఓ ఏనుగును ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని చాలామంది అనుకోరు. ఇంతా చేసేది వాటి దంతాల కోసం… వాటితో వచ్చే డబ్బుల కోసం. ఏనుగు తొండం, మొండెం వేరైన ఈ ఫొటో స్టోరీ మనసులు ద్రవింపజేస్తోంది. ఈ ఫొటోను డ్రోన్ కెమెరాతో తీశారు.

అది సౌత్ ఆఫ్రికాలోని బోత్ స్వానా దేశం. అక్కడ జంతువులెక్కువ. ఐతే.. ఏనుగుల కౌంట్ క్రమంగా తగ్గుతోంది. వేటగాళ్లు రెచ్చిపోవడంతో వాటి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఓ అంచనా ప్రకారం అక్కడ ఏనుగు దంతాల వేట 500శాతానికి పైగా పెరిగిందట. అందుకే.. అక్కడ  2014 నుంచి ఏనుగుల వేటపై నిషేధం విధించారు. పరిస్థితి మారిందన్న అంచనాతో.. రెండు నెలల కిందట అక్కడ ఏనుగుల వేటపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత కనిపించిందే ఈ ఫొటో.

మనిషిలోని మానవత్వం అంతరించిపోయిందా అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా మారిందంటున్నారు దీని గురించి తెల్సినవాళ్లు.

ఏనుగును ఎలా చంపారంటే…

ఏనుగును దంతాల కోసం ఎలా చంపారో ఆ దేశ పోలీసులు వివరించారు. ఆయుధాలతో ఏనుగును ముందుగా పదుల సంఖ్యలో వేటగాళ్లు ముట్టడించారు. భారీ కర్రలతో దాని పొట్టపై కొట్టి కూల్చారు. గాయాలతో హూనయ్యేలా దాడి చేశారు. ఆ తర్వాత చెట్టు దుంగలను కోసే పెద్ద పెద్ద రంపాలు తీసుకొచ్చి తొండం భాగాన్ని కోశారు. అలా.. .ఏనుగు దంతాలను వేరుచేసి ఎత్తుకుపోయారు.

Latest Updates