ఢిల్లీలో అన్నీ తెరుస్తం: సీఎం కేజ్రీవాల్

  • వారం పాటు బార్డర్స్ మూసి ఉంచుతామని ప్రకటన

న్యూఢిల్లీ: బార్బర్ షాపులు, సెలూన్లతో సహా అన్ని దుకాణాలు తిరిగి ఓపెన్ అవుతాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్పా సెంటర్లకు మాత్రం అనుమతించబోమన్నారు. సరి, బేసి విధానం లేకుండా అన్ని మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్ ఇస్తామన్నారు. కేంద్ర ప్రకటంచిన.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం ఢిల్లీలో అమల్లో ఉంటుందన్నారు. టూవీలర్ బైక్​లకు పర్మిషన్ ఇస్తామన్నారు. కంపెనీలు, ఫ్యాక్టరీలకు కూడా అనుమతిస్తామన్నారు. లాక్​డౌన్ సడలింపులతో నేటితో అన్​లాక్​1లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీ బార్డర్స్ తెరవడంపై సీఎం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర బార్డర్లు ఓపెన్ చేస్తే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఢిల్లీలోకి తరలివచ్చే చాన్స్ ఉందని, అందుకే అన్ని షాపులు తెరవనున్నట్లు ప్రకటించారు. అయితే ఒక వారం పాటు మూసి ఉంచుతామని, పాస్ లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ కల్పిస్తామని చెప్పారు. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బార్డర్లు తెరవాలా వద్దా అనేదానిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు.
‘‘మేము బార్డర్స్ ఓపెన్ చేసిన మరుక్షణం.. దేశవ్యాప్తంగా ప్రజలు ట్రీట్​మెంట్ల కోసం ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ దేశానికి చెందినది. అలాంటప్పుడు రాష్ట్రం బయటి నుంచి వచ్చిన వారికి ట్రీట్​మెంట్ చేయడానికి ఎలా నిరాకరిస్తాం?’ అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ఢిల్లీలో ఇప్పటికి వివిధ ఆస్పత్రలుల్లో కరోనా పేషెంట్ల కోసం 9,500 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

Latest Updates