న్యూస్ చానెళ్ల రేటింగ్స్‌‌పై బార్క్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: టీఆర్పీ రేటింగ్స్‌‌పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో బ్రాడ్‌‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 12 వారాల పాటు న్యూస్ చానెళ్ల వ్యూయర్‌‌షిప్ రేటింగ్స్‌‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బార్క్ నిర్ణయం తీసుకుంది. హిందీ, ఇంగ్లీష్, బిజినెస్ న్యూస్ చానెల్స్‌తో పాటు ప్రాంతీయ భాషా వార్తా చానెల్స్‌‌పై ఈ నిర్ణయం తక్షణమే అమలు రానుంది. ఈ నిర్ణీత గడువులో అన్ని చానెళ్లకు సంబంధించిన వీక్లీ రేటింగ్స్‌‌ను బార్క్ పబ్లిష్ చేయబోదు. అయితే రాష్ట్రాలు, భాషల వారీగా న్యూస్ జనరేషన్‌‌కు సంబంధించి ఆడియన్స్ ఎస్టిమేషన్‌‌ను మాత్రం రిలీజ్ చేయనుంది. చానెల్స్‌‌కు రేటింగ్స్ ఇవ్వడంపై అవసరమైన మార్పులను సూచించేందుకు టెక్నికల్ కమిటీని బార్క్ నియమించింది. రాబోయే 8 నుంచి 12 వారాలపాటు ఈ కమిటీ ప్రస్తుత స్టాండర్స్, స్టాటిస్టికల్ డేటాను పరిశీలించి కావాల్సిన సూచనలు, విధివిధానాలను బార్క్‌‌కు అందించనుంది.

Latest Updates