డిసెంబరు 31 వరకు బార్లు బంద్

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బార్ల లైసెన్సులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో ఏపీ లోని అన్ని బార్లు శుక్రవారం రాత్రి నుంచి మూతపడనున్నాయి. లైసెన్సుకు గడువు డిసెంబర్ 31, 2019 వరకు ఉన్నా.. బార్లను తెరవద్దని చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త బార్ల పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలో 40 శాతం బార్లు తగ్గించి మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని  నిర్ణయించింది.  రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉంచాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Latest Updates