బాసరలో ఘనంగా వసంతోత్సవాలు

చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి ఏటా మాఘ మాసం ఐదో రోజున వసంత పంచమి (శ్రీ పంచమి) వేడుకలు బాసర క్షేత్రంలో వైభవంగా జరుగుతాయి. ఏటా ఒక్క రోజు మాత్రమే వేడుకలు నిర్వహిస్తుండగా, ఈ సారి మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు, రేపు అమ్మవారికి అభిషేకాలు, ఆదివారం పంచమి వేడుకలు జరగనున్నాయి. పంచమి రోజున పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో బాగా రాణిస్తారని, అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.  అమ్మవారి జన్మదినోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 10న జరిగే వేడుకలకు బాసరలోని అమ్మవారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

నేటి నుంచే ఉత్సవాలు

ఈ రోజు ఉదయం 4 గంటలకు అమ్మవారికి నిత్యాభిషేకంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఉత్సవాల్లో అమ్మవారికి వేకువజామున మంగళ వాయిద్యాల సేవ, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకరణ నివేదన, మంత్రపుష్పం తదితర పూజలు చేపట్టనున్నారు. నేడు, రేపు అమ్మవారికి ఉదయం 4 గంటలకు అభిషేకం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం ఉదయం 2 గంటలకే అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి ఉదయం 9 గంటలకు పట్టువస్త్రా ల సమర్పణ, 11 గంటలకు చండీ హవనము, మహా విద్య, ఆశీర్వచనము వంటి పూజలు జరిపి, వేదస్వస్తి పూర్ణాహుతితో ఆలయ అర్చకు లు ఉత్సవాలను ముగిస్తారు.

పట్టు వస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం

ఆదివారం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రా లను సమర్పించనుంది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వఅధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ముథోల్ ఎమ్మెల్ యే గడ్డి వారి విట్టల్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అక్షరాభ్యాసాల నిమిత్తం అధిక సంఖ్యలో భక్తు లు రానుండడంతో ఆలయ వసతి గృహాల ఎదుట నుం చి టీటీడీ సత్రం వరకు తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు, చిన్నారులకు పండ్లు, పాలు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ఆవరణలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Latest Updates