బస్వాపురం రిజర్వాయర్ డిసెంబర్ లోగా పూర్తి కావాలి

యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్

యాదాద్రి, వెలుగు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి బస్వాపురం రిజర్వాయర్ పూర్తి చేయాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనితా రామచంద్రన్‌ ఆఫీసర్లను ఆదేశించారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శిం చారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు, కెనాల్ డిస్ర్టిబ్యూషన్‌ , భూసేకరణ, రిహాబి లిటేషన్‌ , రీ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెం ట్‌ వివరాలను ఆఫీసర్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ బీఎన్‌. తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తిమ్ మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేకరించిన భూమిలో 228 ఎకరాలకు పేమెంట్​ఇచ్చామని, మరో 145 ఎకరాలకు వారంలో పేమెంట్​ఇస్తామన్నారు. బీఎన్‌ .తిమ్మాపూర్, జంగంపల్లి, బస్వాపూర్, వడపర్తి, రుస్తాపూర్ గ్రామాల్లో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవసరమైన భూమిని వెంటనే సేకరించాలన్నారు. అలాగే జంగంపల్లిలో భూసేకరణ రేటును ఫైనల్ చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ఆమె వెంట ట్రైనీ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆఫీసర్లు శ్రీనివాస్, డీఈ కుమార్, వెంకటప్రసాద్, వెంకటస్వామి ఉన్నారు.

 

Latest Updates