పాయల్ ఘోష్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

ముంబై: బాలీవుడ్‌‌లో మరోమారు మీటూ మూమెంట్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ హిందీ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలకు కంగనా రౌత్ మద్దతు తెలిపింది. తాజాగా ఈ ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ స్పందించాడు. పాయల్ వ్యాఖ్యలను ఖండించిన అనురాగ్.. తనను మౌనంగా ఉంచేందుకు యత్నిస్తున్నారని విమర్శించాడు. ‘వావ్, నన్ను నిశ్శబ్దంగా ఉంచేందుకు నీకు చాలా టైమ్ పట్టింది. నన్ను మౌనంగా ఉంచేందుకు అబద్ధాలు చెప్పడంతోపాటు ఈ విషయంలో మరో మహిళను లాగారు. మేడమ్ ఒక మహిళవు అయినందుకు నీ హద్దుల్లో నువ్వు ఉండు. నేను చెప్పేదొక్కటే.. ఈ ఆరోపణలు నిరాధారం’ అని అనురాగ్ హిందీలో ట్వీట్ చేశాడు. తాను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని, ఎవరైనా చేసినట్లు తెలిస్తే ఊరుకోనని చెప్పాడు. ఏం జరుగుతుందో చూద్దామని, మీ వీడియోలోనే ఎంత నిజముందో, అబద్ధముందో తెలుస్తోందని పేర్కొన్నాడు. అనురాగ్ కశ్యప్‌‌పై ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ తెలుగులో మంచు మనోజ్‌ సరసన ప్రయాణం మూవీలో నటించింది.

Latest Updates