డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ వేడుక

తెలంగాన సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు విదేశాల్లోను గ్రాండ్ గా జరుగుతున్నాయి. శనివారం సిడ్నీ, డల్లాస్ లలో బతుకమ్మ సంబురాలు గ్రాండ్ గా జరిగాయి.

డల్లాస్ లో  జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడి ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు భారత మహిళలు.

అటు సిడ్నీలో బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన బ‌తుక‌మ్మ ఆటా-పాటతో సిడ్నీ నగరం పూల‌జాత‌ర‌తో ప‌ర‌వ‌శిచింది.

Latest Updates