ఈ సారి బతుకమ్మ చీరలు హాట్ కేక్స్ లాగా తీసుకుంటారు : కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకగా చీర ఇవ్వనున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇవాళ (సెప్టెంబర్-27) బతుకమ్మ చీరల డిస్ ప్లే ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ కార్యక్రమంతో నేతన్నలకు చేతినిండా పని దొరికిందని తెలిపారు. మహిళలకు కానుకా..నేతన్నలకు ఉపాధి దొరుకుతుందనే ఆలోచనతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఈ సంవత్సరం 95 లక్షల చీరలు పంపిణీ చేయనున్నట్లు చెప్పిన కేటీఆర్..అక్టోబర్ -12 నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 80 రకాల కలర్స్ తో..రూ.280 కోట్లతో చీరలను తయారీచేయించినట్లు వెల్లడించారు. అన్ని చీరలను సిరిసిల్లలోని మరమగ్గాలమీద తయారు చేయించామన్నారు. పోయిన సంవత్సరం సమయంలేకపోవడంతో.. సూరత్ నుంచి వచ్చిన చీరలు నాసిరకంగా ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ..ఈసారి సిరిసిల్లలోనే తయారు చేయించినట్లు చెప్పారు. ఈ సారి చీరలు హాట్ కేక్స్ లాగా తీసుకుంటారన్నారు. చాలా అద్భుతంగా కలర్స్ ఉన్నాయని.. ఒక్కో చీరకు రూ.290 ఖర్చయిందన్నారు. సిరిసిల్లలో 20వేల మరమగ్గాలపై చీరలు తయారు చేయించి నేతన్నలకు ఉపిధి కల్పించామని తెలిపారు. ఇప్పటికే చీరలు జిల్లాలకు చేరాయని..ఈ సారి ఈ కార్యక్రమం బిగ్ సక్సెస్ అవుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్.

Latest Updates