ఆస్ట్రేలియాలో ఘ‌నంగా బతుకమ్మ ఉత్సవాలు

దేశ‌విదేశాల్లో బతుక‌మ్మ ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఎన్నారైలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనల కారణంగా ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ATAI) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆన్‌లైన్ లో జ‌రిగాయి. మొద‌టి రోజున‌ ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ తో ప్రారంభమై తొమ్మిది రోజులు ఘనంగా జరిపారు మొదటిరోజు ఉత్సవాలకి  ప్రపంచంలో ఉన్న తెలంగాణ సంఘాలు హాజరై శుభాకాంక్షలు తెలిపాయి అలాగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత , తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు

ఈ సంద‌ర్భంగా శ్రీమ‌తి కవిత మాట్లాడుతూ ATAI  ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారని..  ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఉత్సవాలు ఆన్‌లైన్‌లో జరుపుకోవడం  జరిగాయన్నారు. తెలంగాణ సాంప్రదాయాలని కాపాడుతూ ఆస్ట్రేలియాలో ఇంత ఘనంగా ఉత్సవాలు  జరిపినందుకు కార్యవర్గాన్ని అభినందించారు. అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆస్ట్రేలియా తెలంగాణ సంఘం అటు తెలంగాణలోనూ ఇటు ఆస్ట్రేలియాలో వారు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉండి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ATAI  ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన కవిత గారికి ,మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ATAI  అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates