గర్షకుర్తిలో బతుకమ్మ చీరల తయారీ యూనిట్

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం గర్షకుర్తికి మంజూరైన బతుకమ్మ చీరల తయారీ యూనిట్‌ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో అతి పెద్ద పండుగైన బతుకమ్మకు పేద, ధనిక బేధం లేకుండా మహిళలంతా కొత్త చీరలు కట్టుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని తెలిపారు రవిశంకర్.

నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బతుకమ్మ చీరల తయారీని గత కొన్నేళ్లుగా సిరిసిల్ల నేత కార్మికులకు అందజేయడంతో వారు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సిరిసిల్ల తరహాలో బతుకమ్మ చీరల తయారీకి అవకాశం ఇవ్వాలని గర్శకుర్తి నేత కార్మికులు తమ దృష్టికి తీసుకురాగా మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. ఆయన వెంటనే స్పందించి గర్షకుర్తిలో బతుకమ్మ చీరల తయారీకి అవకాశం ఇప్పించినట్లు తెలిపారు.

 

Latest Updates