ఆటగాళ్ల సమ్మె వెనుక కుట్ర!

BCB smells conspiracy behind Bangladesh players strike

ఢాకా: ఆటగాళ్లు చేపట్టిన మెరుపు సమ్మె వెనుక కుట్ర దాగి ఉందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) భావిస్తోంది. సమ్మె విషయమై మీడియాను సంప్రదించడానికంటే ముందు బీసీబీతో చర్చిస్తే బాగుండేదని బోర్డు చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఆట ప్రతిష్ఠను దెబ్బ తీసేం దుకే ఈ సమ్మె చేపట్టారని, దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే కనుక్కుంటామని పేర్కొన్నారు . దేశంలో గందరగోళం సృష్టిం చడంతో ఆట ఇమేజీని దెబ్బతీయడానికే దీన్ని చేపట్టారని నజ్ముల్‌ వ్యాఖ్యానిం చారు. మరోవైపు క్రికెటర్లం తా ఎందుకంత కోపంగా ఉన్నా రో, వాళ్ల నిరాశ, నిస్పృహలకు కారణమేంటో తెలియదని బోర్డు డైరెక్టర్‌ జలాల్‌ యూనస్‌ అన్నారు . ఇదంతా బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంలాగే తోస్తుందని వ్యాఖ్యానిం చారు. బంగ్లా క్రికెట్‌ బోర్డులో ఫిక్సింగ్‌ భూతం రాజ్యమేలుతుందని బీసీబీ మాజీ చీఫ్‌ సాబెర్‌ హుస్సేన్‌ చౌదురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత మ్యాచ్​ ఫిక్సిం గ్ , అవినీతిని ప్రోత్సహించే ఏకైక జాతీయ క్రీడా సంఘం బీసీబీ మాత్రమే అని ఆరోపించారు.

BCB smells conspiracy behind Bangladesh players strike

Latest Updates