BCCIకి కాసులు కురిపిస్తున్నIPL

BCCI-IPLబోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కి కాసులు కురిపించే కల్పవృక్షంగా మారిపోయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన IPL ద్వారా.. ప్రస్తుత లెక్కల ప్రకారం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ. 2,017 కోట్ల మిగులు ఆదాయాన్నిBCCI  సంపాధించనుంది.

బోర్డుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు, అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల ద్వారా రూ.125 కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఐపీఎల్ ఆదాయమే బోర్డు మొత్తం ఆదాయంలో 95 శాతం స్థాయిలో ఉండనుంది. 45 రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం  ఏడాదిలో మిగిలిన అన్ని రోజుల్లో వచ్చే ఆదాయం కంటే 16 రెట్లు అధికం. రూ.3,413 కోట్ల ఆదాయంలో క్రీడా సదుపాయాలు, ఇతరత్రా వాటికి రూ.1,272 కోట్లను ఖర్చు చేయనుంది BCCI.

Posted in Uncategorized

Latest Updates