టీమిండియాకు రూ.5 కోట్ల భారీ నజరానా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా చేజిక్కించుకుంది. నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి హిస్టారికల్ విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది. ప్రముఖ నేతలు, సెలెబ్రిటీలు భారత ప్లేయర్లను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.

టీమిండియా గెలుపు ప్లేయర్ల నిబద్ధత, కఠోర శ్రమతోపాటు వారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందని, టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘ప్రతి సెషన్‌‌లో ఓ కొత్త హీరోను కనుగొన్నాం. ప్రతి కఠిన సవాల్‌‌కు ఎదురొడ్డి నిలిచాం. హద్దులను చెరిపేస్తూ భయపడని క్రికెట్ ఆడాం. గాయాలు, అనిశ్చిత పరిస్థితులను నమ్మకంతో ఎదుర్కొన్నాం. కంగ్రాట్స్ ఇండియా’ అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఇది మర్చిపోలేని గెలుపు అని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌‌ను చేజిక్కించుకోవడం చాలా విశేషమని, జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నాడు.

ఆస్ట్రేలియా పై చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. జట్టులో ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమైన సమయంలో, పరిమిత వనరులతో టీమిండియా అద్భుతం చేసిందని ప్రశంసించారు. కెప్టెన్ రహానేతోపాటు జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Updates