టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ

bcci-coa-advertises-for-the-post-of-team-india-head-coach

భారత క్రికెట్ జట్టుకు త్వరలో ప్రధాన కోచ్‌ మారనున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కోచ్ గా కొనసాగుతున్నారు. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్  ఫర్  క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) ఓ ప్రకటన విడుదల చేయనుంది. వాస్తవానికి ఇంగ్లాండ్‌ వేదికగా గత ఆదివారం ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి కోచ్ పదవీకాలం ముగిసింది. అయితే  వచ్చే నెలలో వెస్టిండీస్ తో టూర్ కారణంగా కాంట్రాక్ట్ ను 45 రోజుల పాటు పొడిగించారు.

వెస్టిండీస్ పర్యటన తర్వాత… సెప్టెంబరు 15 నుంచి ఇండియాలో… దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని BCCI నిర్ణయించింది.

Latest Updates