CEO సభ్యుల ఇంగ్లండ్‌ టూర్‌పై వివాదం

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌కు కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ)నుంచి ఇద్దరు సభ్యులు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో బీసీసీఐలో మరో వివాదం రేగింది. సీఓఏ సభ్యులు ఇంగ్లండ్‌ వెళ్లడానికి బీసీసీఐ సభ్యులు సముఖంగా లేరు. బోర్డు అధికారులు తమ బాధ్యతను పక్కనపెట్టి జట్టుతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లడాన్ని గతంలో సీఓఏ సభ్యులు తప్పుబట్టడమే ఇప్పుడు వ్యతిరేకతకు కారణం. కాగా, ముగ్గురు ఆఫీస్‌ బేరర్లు, ఇద్దరు బోర్డు అధికారులు, ఇద్దరు సీఓఏ సభ్యులు వారం రోజుల పాటు ఇంగ్లండ్‌లోఉంటే బీసీసీఐ కనీసం రూ.1.25 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

 

Latest Updates