అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహించే యోచన

టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే లైన్ క్లియర్?
ఆ విండో వాడుకోవాలని బోర్డు ప్లాన్

కరోనా వైరస్ కారణంగా.. వరల్డ్ వైడ్ గా చాలా స్పోర్ట్స్, ఈవెంట్స్ రద్దుకావడమో, లేక వాయిదా పడటమో జరుగుతోంది. ఇప్పుడు
వైరస్ వ్యాప్తి మరి ఎక్కువగా ఉండటంతో.. అక్టోబర్–నవంబర్లో జరిగే టీ 20 వరల్డ్ కప్ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్ర్టేలియాలో జరగాల్సిన ఈ ఈవెంట్ పై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని టీ20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదాపడితే… ఆ విండోను ఐపీఎల్
కోసం ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దాదాపు మూడు వారాల సమయం ఉంటుంది కాబట్టి లీగ్ మొత్తం లేక మినీ ఐపీఎల్ నిర్వహిం
చాలనే ఆలోచన చేస్తోంది. ‘ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ బోర్డర్స్ కూడా మూసివేశారు. ఆస్ర్టేలియాలో అయితే ఆరునెలల పాటు లాక్డౌన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ టైమ్లో పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. ఇంటర్నేషనల్ బోర్డర్స్ మూసివేత విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఇలాంటి స్థితిలో ఐపీఎల్ కు అక్టోబర్, నవంబర్ విండో సేఫ్ అని అనుకుంటున్నాం. కానీ మళ్లీ టీ20 వరల్డ్ కప్ తో క్లాష్ వస్తుంది. ఈ రెండింటి మధ్య క్లాష్ రావొద్దంటే ఐసీసీ పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టోర్నీని రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తే మేం ఈ విండో కోసం ప్రయత్నిస్తాం. ఎందుకంటే ప్రతీ దేశంలో ఆరునెలలు ఇంటర్నేషనల్ బోర్డర్స్ క్లోజ్ చేసినా అక్టోబర్లో ఓపెన్ అవుతాయి. అయినప్పటికీ మళ్లీ వైరస్ వ్యాప్తి ఉండకూడదు అంటే పరిస్థి
తులన్నీ కంట్రోల్లోకి రావాలి. ఇవన్నీ జరగాలంటే చాలా విషయాలు మనకు అనుకూలంగా జరగాలి. అప్పుడే ఐపీఎల్ సాధ్యమవుతుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

2022లో టీ20 వరల్డ్ కప్!
ఒకవేళ టీ20 వరల్డ్ కప్ను ఐసీసీ వాయిదా వేస్తే.. ప్రస్తుత ఎఫ్టీపీ ప్రకారం తిరిగి 2022లోనే జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే ద్వైపాక్షిక సిరీస్ల
కారణంగా వచ్చే ఏడాది ప్రతి కంట్రీకి టైట్ షెడ్యూల్ ఉంది. దీనికి తోడు ప్రతిష్టాత్మక టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచులు కూడా ఉంటాయి. వీటి మధ్యలో టీ20 వరల్డ్ కప్ కోసం మూడు వారాల టైమ్ కేటాయించడమంటే కత్తిమీద సామే. ఒకవేళ పట్టుబట్టి కేటాయించినా.. ఎఫ్టీపీ దెబ్బతింటుంది. ‘ప్రతి దేశానికి 2021లో బిజీ షెడ్యూల్ ఉంది. ఇలాంటి టైమ్లో టీ20 వరల్డ్ కప్ను నిర్వహించడం దాదాపు అసాధ్యం. అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి అక్టోబర్, నవంబర్ విండోను ఐపీఎల్ కోసం చర్చిస్తున్నాం ’ అని బోర్డు అధికారి వివరించారు.

For More News..

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

Latest Updates