బీసీసీఐ అధ్యక్ష పదవే బాగుంది: గంగూలీ

క్రికెటర్ గా బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టమన్నాడు సౌరబ్ గంగూలీ. ఆ బాధ్యత కంటే.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించడమే ఈజీ అని చెప్పాడు. స్పోర్ట్స్ ఏసెస్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ 2019 గాను ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికవడంతో అవార్డును భారత జట్టు తరపున తీసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన గంగూలీ… భారత జట్టుకు ఉత్తమ జట్టు అవార్డు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశాడు. జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ కు అభినందనలు తెలిపాడు. అస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటంతో వారు ఇక్కడ లేరంటూ.. కొత్త ఏడాది సందర్భంగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ ఏడాదిలో మెగా టోర్నీలున్నాయన్న గంగూలీ… అండర్ 19 ప్రపంచకప్, పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత జట్లు విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు.

Latest Updates