గంగూలీ ఇంట్లో నలుగురికి కరోనా

కోల్‌‌కతా: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. గంగూలీ సోదరుడు, క్యాబ్ సెక్రటరీ అయిన స్నేహశిష్​ గంగూలీ భార్య కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లిదండ్రులతో పాటు పని మనిషికి కూడా వైరస్ సోకినట్లు శనివారం తేలింది. ఈ నలుగురిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దాదా నివసించే ఇంట్లో కాకుండా స్నేహశిష్​ ఫ్యామిలీ వేరే ప్రాంతంలో ఉంటున్నది. అక్కడే వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే స్నేహశీశ్‌‌కు నిర్వహించిన కరోనా టెస్ట్‌‌లో నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో దాదా కుటుంబం ఆందోళన చెందుతోంది.

నాకంటూ కొంత టైమ్ దొరికింది

Latest Updates