ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన గంగూలీ

మైల్డ్‌ హార్ట్‌ ఎటాక్‌‌తో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనకు చికిత్స చేసిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గంగూలీ తెలిపారు. ‘నాకు చికిత్స చేసినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని గంగూలీ అన్నారు.

ఆయన ఈ నెల 2న మైల్డ్‌ హార్ట్‌ ఎటాక్‌‌తో కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలో మూడు బ్లాక్స్ ఉండటం గుర్తించిన వైద్యులు.. గంగూలీకి యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్ అమర్చారు. మిగతా బ్లాక్స్‌కు కొంతకాలం తర్వాత స్టెంట్స్ అమర్చనున్నారు.

పోలీసుల కస్టడీకి లోన్ యాప్స్ నిందితుడు లాంబో

Latest Updates