గంగూలీ చేతుల్లో ఎమ్మెస్కే టీమ్‌‌ ఫ్యూచర్‌‌

న్యూఢిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్‌‌ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ భవితవ్యం బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ చేతుల్లో ఉంది. పాత నిబంధనల ప్రకారం కమిటీ కాంట్రాక్టు పూర్తయినప్పటికీ.. బీసీసీఐ రాజ్యాంగంలో చేర్చిన కొత్త నిబంధన ప్రకారం ప్రసాద్‌‌ అండ్‌‌ కో వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌ వరకూ పదవిలో ఉండొచ్చు. కానీ, దాన్ని బీసీసీఐ బాస్‌‌ గంగూలీ డిసైడ్‌‌ చేయాల్సి ఉంది. ప్రసాద్‌‌ (సౌత్‌‌ జోన్‌‌), గగన్‌‌ ఖోడ (సెంట్రల్‌‌)ను 2015లో జరిగిన బీసీసీఐ ఏజీఎమ్‌‌ అపాయింట్‌‌ చేసింది. కొత్త నిబంధన ప్రకారం టెక్నికల్‌‌గా వీరిద్దరూ వచ్చే సెప్టెంబర్‌‌ వరకూ పదవుల్లో ఉండొచ్చు. 2016లో ఎంపికైన జతిన్‌‌ పరాంజపే (ఈస్ట్‌‌జోన్‌‌), శరణ్‌‌దీప్‌‌ సింగ్‌‌ (నార్త్‌‌ జోన్‌‌), దేవాంగ్‌‌ గాంధీ (ఈస్ట్‌‌ జోన్‌‌)కు మరో రెండేళ్లు సెలెక్టర్లుగా కొనసాగొచ్చు. అయితే,

నిబంధనల ప్రకారం ప్రతీ ఏజీఎమ్‌‌లో సెలెక్టర్ల కాంట్రాక్ట్‌‌ను పునరుద్దరించాల్సి ఉంటుంది. కానీ, బీసీసీఐ పాలన కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్ల చేతుల్లోకి వెళ్లడంతో 2017, 2018లో ఏజీఎమ్స్‌‌ జరగలేదు. ఈ నేపథ్యంలో  ఎమ్మెస్కే అండ్​ కోను కొనసాగించేందుకు గంగూలీ సుముఖంగా ఉన్నాడో లేడో తెలియాల్సి ఉంది. సెలెక్టర్లతో గంగూలీ భేటీ తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

BCCI president Sourav Ganguly to decide future of MSK Prasad-led selection panel

Latest Updates