ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ

రోహిత్‌ లేకుండానే.. ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక

టెస్ట్‌‌ టీమ్‌‌లో సిరాజ్‌‌కు స్థానం

టీ20లకు సెలెక్ట్‌‌ అయిన వరుణ్‌

ముంబై: కరోనా బ్రేక్‌‌ తర్వాత టీమిండియా ఆడే తొలి ఇంటర్నేషనల్‌‌ సిరీస్‌‌ అయిన ఆస్ట్రేలియా టూర్‌‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది.  రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్‌‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి.  సునీల్‌‌ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్‌‌ కమిటీ సోమవారం వర్చువల్‌‌గా మీట్‌‌ అయ్యి..  ఈ సిరీస్‌‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే ఎడమ కాలి గాయంతో బాధపడుతున్న స్టార్‌‌ ఓపెనర్‌‌ రోహిత్‌‌ శర్మను ఒక్క ఫార్మాట్‌‌కు కూడా ఎంపిక చేయకపోవడం కాస్త షాక్‌‌కు గురి చేసింది. రోహిత్‌‌తోపాటు  పేసర్‌‌ ఇషాంత్‌‌ శర్మను కూడా సెలెక్టర్లు పక్కనపెట్టారు. గాయాల బారిన పడిన రోహిత్‌‌ , ఇషాంత్‌‌.. తమ మెడికల్‌‌ టీమ్‌‌ పర్యవేక్షణలో ఉంటారని, కోలుకున్న తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది. హైదరాబాదీ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ ఊహించిన విధంగానే టెస్ట్‌‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.  మరో తెలుగు క్రికెటర్‌‌ హనుమ విహారి టెస్ట్‌‌ టీమ్‌‌లో స్థానం నిలబెట్టుకున్నాడు.  రోహిత్‌‌ లేకపోవడంతో వన్డే, టీ20 జట్లకు కేఎల్‌‌ రాహుల్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌గా నియమితుడయ్యాడు.  అంతేకాక టెస్ట్‌‌ టీమ్‌‌లో తిరిగి స్థానం దక్కించుకున్నాడు. రోహిత్‌‌ లేకపోవడంతో మయాంక్‌‌ అగర్వాల్‌‌ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. మరోపక్క కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ తరపున అదరగొడుతున్న  మిస్టరీ స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి టీ20 టీమ్‌‌లో చోటు దక్కించుకున్నాడు. రిషబ్‌‌ పంత్‌‌ను వన్డే, టీ20ల నుంచి తప్పించిన సెలెక్టర్లు టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. పేసర్‌‌ నవదీప్‌‌ సైనీ మూడు ఫార్మాట్లకు సెలెక్ట్‌‌ అయ్యాడు. ఇక, ఐపీఎల్‌‌లో సత్తా చాటిన కమలేశ్‌‌ నాగర్‌‌కోటి, కార్తీక్‌‌ త్యాగి, ఇషాన్‌‌ పొరెల్‌‌,  నటరాజన్‌‌ బ్యాకప్‌‌ బౌలర్లుగా ఆసీస్‌‌ వెళ్లనున్నారు.

టెస్ట్‌‌ జట్టు: విరాట్‌‌ కోహ్లీ(కెప్టెన్‌‌), మయాంక్‌‌, పృథ్వీ షా, కేఎల్‌‌ రాహుల్‌‌, పుజారా, రహానె(వైస్‌‌ కెప్టెన్‌‌) విహారి, శుభ్​మన్‌‌ గిల్‌‌, సాహా(కీపర్‌‌), రిషబ్‌‌ పంత్‌‌ (కీపర్‌‌), బుమ్రా, షమీ, ఉమేశ్‌‌ యాదవ్‌‌, సైనీ, కుల్దీప్‌‌, జడేజా, అశ్విన్‌‌, సిరాజ్‌‌

వన్డే జట్టు: విరాట్‌‌ కోహ్లీ (కెప్టెన్‌‌), శిఖర్ ధవన్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌(వైస్‌‌ కెప్టెన్‌‌), అయ్యర్‌‌, మనీశ్‌‌ పాండే, హార్దిక్‌‌ పాండ్యా, మయాంక్‌‌ అగర్వాల్‌‌, జడేజా, చహల్‌‌, కుల్దీప్‌‌, బుమ్రా, షమీ, సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌

టీ20 జట్టు: విరాట్‌‌ కోహ్లీ(కెప్టెన్‌‌), ధవన్‌‌, మయాంక్‌‌, రాహుల్‌‌(వైస్‌‌ కెప్టెన్‌‌), అయ్యర్‌‌, మనీశ్‌‌ పాండే, హార్దిక్‌‌ పాండ్యా, సంజూ శాంసన్‌‌, జడేజా, సుందర్‌‌, చహల్‌‌, బుమ్రా, షమీ, సైనీ, దీపక్‌‌ చహర్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి

For More News..

వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్

పై చదువుల కోసం పక్క రాష్ట్రాలకు పోనంటున్న స్టూడెంట్లు

ప్లే ఆఫ్‌‌ రేస్‌‌ నుంచి వైదొలిగిన ఫస్ట్‌‌ టీమ్

Latest Updates