కోహ్లీపై ఎవరూ కంప్లయింట్ చేయలే

కోహ్లీపై ఎవరూ కంప్లయింట్ చేయలే

ముంబై: టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌‌ కోహ్లీ అనూహ్యంగా తప్పుకోవడానికి జట్టులోని సీనియర్ ప్లేయర్‌లతో విభేదాలే కారణమని వార్తలు వస్తున్నాయి. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌ ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ వాతావరణం కోహ్లీ వర్సెస్‌‌ సీనియర్‌‌ ప్లేయర్లుగా మారిపోయిందని ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇది ఇలాగే కొనసాగితే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందిన బీసీసీఐ.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ధోనీని మెంటార్‌‌గా తీసుకొచ్చిందని పేర్కొంది. ఈ వార్తల్లో ఎంత వాస్తవమో తెలియరాలేదు. అయితే దీనిపై తాజాగా బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. దీంట్లో ఎంత మాత్రం నిజం లేదని ధుమాల్ అన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు రాయడాన్ని ఇకనైనా ఆపాలంటూ ఆయన సీరియస్ అయ్యారు. 

కెప్టెన్సీ గురించి చర్చించలేదు

‘ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి కథనాలు రాయడాన్ని ఆపాలి. ఏ భారత ప్లేయర్‌ కూడా బీసీసీఐకి ఎలాంటి కంప్లయింట్ చేయలేదు. రాతపూర్వకంగా, మౌఖికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తప్పుడు రిపోర్టులు, కథనాలు, వార్తలపై బీసీసీఐ సమాధానాలు ఇవ్వడం కుదరదు. వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేస్తామని కూడా కథనాలు వస్తున్నాయి. జట్టు కూర్పులో మార్పులు చేస్తామని ఎవరు చెప్పారు?’ అని ధుమాల్ ఎదురు ప్రశ్నించారు. కెప్టెన్సీ విభజన గురించి బీసీసీఐ చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులు భారత క్రికెట్‌కు తీవ్ర హానికరమన్నారు. 

విరాట్ నొచ్చుకున్నాడా?

కాగా, డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో విభేదాలు రావడానికి కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీయే కారణమని ఓ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌‌లో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై అలిగిన కోహ్లీ.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌‌బై చెప్పాడని తెలుస్తోంది. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో అశ్విన్‌‌, పుజారా, రహానెపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగతా వాళ్ల ఆటతీరుపై కూడా కాస్త ఇబ్బందికరంగానే మాట్లాడాడు. దీంతో ఆవేదనకు గురైన ఆ ముగ్గురు.. సెక్రటరీ జై షాకు పర్సనల్‌‌గా ఫోన్‌‌ చేసి అన్ని విషయాలు చెప్పారు. షా ఇతర క్రికెటర్లతో కూడా మాట్లాడగా అందరి వాదన ఒకేలా ఉండటంతో ఇంగ్లండ్‌‌ టూర్‌‌ ఎండ్‌‌లో చర్యలు తీసుకోవాలని బోర్డు డిసైడ్‌‌ అయ్యింది’ అని సదరు పత్రిక పేర్కొంది. దీనికితోడు ఇంగ్లండ్‌‌తో ఆడిన నాలుగు టెస్ట్‌‌ల్లోనూ అశ్విన్‌‌ను ఆడించకుండా కోహ్లీ మరింత ఆజ్యం పోశాడని, దాంతో, టీ20 వరల్డ్​ కప్​నకు టీమ్​ ఎంపికలో కోహ్లీ సూచనలను బోర్డు పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. దీనికి నొచ్చుకున్న విరాట్​ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా అరుణ్ ధుమాల్ స్పందించినందున.. ఇకనైనా ఈ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి. 

మరిన్ని వార్తల కోసం: 

కేటీఆర్ కనబడుట లేదు

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ.. 

బీజేపీలో చేరను.. కాంగ్రెస్‌లో ఉండను

వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడ్ని కాపాడిన కానిస్టేబుల్

చెబితే వింటది.. చెప్పింది చేస్తది