‘రాజ్యాంగాన్ని సవరిస్తే.. సుప్రీంకోర్టును ఎగతాళి చేసినట్లే’

న్యూఢిల్లీ:  బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సవరిస్తే.. సుప్రీంకోర్టు అధికారాలను ఎగతాళి చేసినట్లేనని లోథా కమిటీ సెక్రటరీ గోపాల్‌‌‌‌ శంకర్‌‌‌‌నారాయణన్‌‌‌‌ అన్నారు. ఈ విషయంలో ధర్మాసనం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని అభిప్రాయపడిన ఆయన.. అందుకు తగ్గట్టుగానే సముచిత నిర్ణయాలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లేకపోతే బీసీసీఐ అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌లో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ వృథా అవుతాయని చెప్పారు. డిసెంబర్‌‌‌‌ 1న జరిగే బోర్డు ఏజీఎమ్​లో …ఆఫీస్‌‌‌‌ బేరర్ల కూలింగ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ను తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేయడంతో పాటు మరో 11 అంశాలతో కూడిన ఎజెండాను బీసీసీఐ కొత్త కార్యదర్శి జై షా ఖరారు చేశాడు. దీనిపై స్పందించిన శంకర్‌‌‌‌నారాయణన్‌‌‌‌.. క్రికెట్‌‌‌‌ పరిపాలన, సంస్కరణలకు సంబంధించి మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్లడమే అవుతుందన్నారు. గతంలో ఉన్న చాలా అంశాలు ఇప్పుడు ఉనికిలోనే లేవని స్పష్టం చేశారు.

BCCI's bid to change reformed constitution would ridicule Supreme Court: Lodha panel secretary

Latest Updates