కరోనా మహమ్మారి వ్యాప్తిని బీసీజీ అడ్డుకోగలదు!!

న్యూఢిల్లీ: బసిల్లస్ కాల్మెట్టె గెరిన్ (బీసీజీ) అనే ఔషధం కరోనా ట్రీట్‌మెంట్‌లో ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా డెత్ రేట్‌ను తగ్గించడంలో బసిల్లస్ చాలా యూజ్‌ఫుల్ అని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. బీసీజీ వ్యాక్సినేషన్‌తో 30 రోజుల్లో చాలా ఫలితం కనిపించిందని సైంటిస్టులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని ఎందరో శాస్త్రవేత్తలు, డాక్టర్‌‌లు, ప్రొఫెసర్‌‌లు, ల్యాబ్‌లు అహర్నిషలు శ్రమిస్తున్నారు. బీసీజీ గురించి స్టడీ అమెరికన్ అసోసియేషన్‌లో పబ్లిష్ అయింది. దీని ప్రకారం కరోనాను ఎదుర్కోవడంలో బీసీజీ వ్యాక్సినేషన్ పాలసీ చాలా యూజ్‌ఫుల్ అని తేలింది.

సాధారణంగా బీసీజీ వ్యాక్సిన్‌ను పిల్లలకు ట్యుబర్‌‌కులోసిస్ సోకకుండా ముందుగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్‌తో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని తద్వారా పలు ఇన్ఫెక్షన్స్‌, వ్యాధులను సమర్థంగా తట్టుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి బీసీజీ వ్యాక్సినేషన్ కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘బీసీజీ వ్యాక్సిన్ ఫేజ్‌ 3 ట్రయల్‌లో ఉందని తెలుస్తోంది. జైడస్ కాడిలా డీఎన్‌ఏ వ్యాక్సిన్ ఫేజ్ 1,2 ట్రయల్‌తోపాటు నలుగురు వ్యాక్సిన్ క్యాండిడేట్స్‌ ప్రీ క్లినికల్ స్టడీలో అడ్వాన్స్డ్‌ స్టేజెస్‌లో ఉందని సమాచారం.

Latest Updates