మ్యాన్ వర్సెస్ వైల్డ్… మోడీలో మరో కోణం చూస్తారు

మ్యాన్  వర్సెస్  వైల్డ్  ప్రోగ్రామ్ లో భాగంగా  బేర్  గ్రిల్స్  ప్రధాని మోడీతో జరిగిన ఇంటరాక్షన్ పై రియాక్ట్ అయ్యారు. తన కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ షో అవుతుందని, ప్రపంచంలోనే అత్యధిక జనం చూసే ప్రోగ్రామ్ అవుతుందని ఆశిస్తున్నట్లు బేర్ గ్రిల్స్ చెప్పారు. ప్రధాని మోడీలో ఇంతకు ముందు ఎవరూ చూడని కోణాన్ని చూస్తారని చెబుతున్నారు గ్రిల్స్. ప్రధాని మోడీ శాఖాహారి అని చెప్పారు. మోడీ వినయం తనకు నచ్చిందని చెప్పారు. అడవుల్లో  మోడీ చాలా కంఫర్ట్ గా కనిపించారని చెప్పారు. చిన్నతనంలో అడవుల్లోనే తిరగడంతో మోడీకి ఇది సాధ్యమైందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది కేవలం మన చేతుల్లోనే ఉందని, ప్లాస్టిక్ వాడకపోవడం, వన్యప్రాణులను కాపాడుకోవాలన్నారు బేర్ గ్రిల్స్.

Latest Updates