ఎలుగుబంటి జోస్యం: ఉక్రెయిన్ అధ్యక్షుడు పొరొషెన్కో

అది రష్యాలోని జూ! అందరూ గుమిగూడారు. ‘పొరొషెన్కో.. పొరొషెన్కో’ అని గట్టిగా అరుస్తున్నారు.. ఇంతలో ఓ ఎలుగుబంటి బోనులోం చి బయటకొచ్చింది. దాని ఎదురుగా మూడు ఫొటోటున్నాయి. వచ్చి ఓ ఫొటోను నలిపేసింది. ఏంటిదంతా అనుకుంటున్నారా? ఉక్రెయిన్‌ కు కాబోయే నాయకుడెవరో చెప్పిందా గుడ్డేలుగు. దాని పేరు బుయాన్‌ . అంటే రష్యా భాషలో దౌర్జన్యం చేసేదని అర్థం. రష్యాలోని క్రాస్‌ నొయార్స్‌ క్‌ నగర శివారు ప్రాంతంలోని జూ దాని నివాసం. ఇలా జోస్యాలు చెప్పడం బుయాన్‌ కు కొత్తేం కాదు. గత ఏడాది ఫుట్‌ బాల్‌ వరల్డ్‌‌ కప్‌ ను ఎవరు గెలుస్తారో చెప్పింది. కానీ అది తప్పయిం దనుకోండి. అయినా ఈసారి ఉక్రెయిన్‌ అధ్యక్షుడెవరో చెప్పే అవకాశమొచ్చింది. ఉక్రెయిన్‌ మాజీ ప్రధాని యులియా టైమోషెంకో , కామిక్‌ యాక్టర్‌‌ వొలోదిమీర్ జెలెన్‌ స్కీ, ప్రస్తుత ప్రెసిడెం ట్‌ పొరొషెన్కో ఫొటోలున్నాయి. దాని ఫుడ్డుపై నేతలు, వాళ్ల ఫొటోలు, పార్టీల జెం డాలున్నాయి. తొలుత యులియా ఫొటో దగ్గరకొచ్చింది బుయాన్‌ . ఫొటోను పట్టుకుంటుం దేమోనని అందరూ ఉత్కం ఠగా చూశారు. కానీ వాసన చూసి జెలెన్‌ స్కీ ఫొటో ముందుకొచ్చింది. ఇక కచ్చితంగా పట్టుకుంటుందనుకున్నారు అంతా. ఫొటోను పట్టుకున్నం త పని చేసి పక్కకెళ్లిపోయిం ది. చివరకు మిగిలిన పొరొషెన్కో ఫొటోను నలిపేసి ఫుడ్డు తినేసింది. అది అలా ఎంపిక చేసినంత మాత్రాన ఆయన గెలుస్తారనుకోకండి. ఎందుకంటే ఒపీనియన్‌ పోల్స్‌ లో జెలెన్‌ స్కీ లీడ్‌ లో ఉన్నట్టు తేలిం ది.ఇంకో ఆడ ఎలుగు అవ్‌ రోరాతోనూ జోస్యం చెప్పించారు. అది మాత్రం జెలెన్‌ స్కీని ఎన్నుకుంది. మరి,ఈసారైనా దాని జోస్యం నిజమవుతుందా!

 

Latest Updates