ఆ గుడ్డెలుగులకు భజన్లంటే ఇష్టం..!

మధ్యప్రదేశ్​ షాహ్​దోల్​ జిల్లా రాజ్ మడ అడవి దగ్గర్లో ఉంటాడీ సన్యాసి. పొద్దునే ఏక్​తార మీటుతూ భజన్లు పాడుతుంటాడు. అవి వినడానికి శ్రోతలున్నారు. ఫొటోలో కనిపిస్తున్న గుడ్డెలుగులే ఈ శ్రోతలు.

భజన్లు విన్నాక, పెట్టే ప్రసాదం తిన్నాక  నెమ్మదిగా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోతాయి. ఎనిమిదేళ్లుగా ఈ గుడ్డెలుగులకు దినచర్య ఇదే అంటున్నారు 65 ఏళ్ల సన్యాసి సీతారామ్​. ఇంతవరకు ఆ గొడ్డెలుగులు ఎవరిపైనా దాడిచేయలేదట.

మరిన్ని వార్తల కోసం

Latest Updates