బ్యూటీ ఇండస్ట్రీ.. రికవరీకి రెడీ

హైదరాబాద్‌‌,వెలుగు: లాక్‌‌డౌన్‌‌దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన బ్యూటీ, పర్సనల్‌‌కేర్‌‌‌‌ఇండస్ట్రీ కోలుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రభుత్వం మినహాయింపులివ్వడంతో ఈ ఇండస్ట్రీ ఇటీవలే తిరిగి ఓపెన్‌‌అయ్యింది. లాక్‌‌డౌన్‌‌ముందులా డిమాండ్‌‌లేనప్పటికి ఇంకో  రెండు, మూడు నెలల్లో తిరిగి మామూలుస్థితికి చేరుకుంటామని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 70 లక్షల మంది ప్రొపెషనల్స్‌‌కు బ్యూటీ, పర్సనల్‌‌కేర్‌‌‌‌ఇండస్ట్రీ ఉపాధి కల్పిస్తోందని చెప్పాయి.
ప్రస్తుతం రూ. 61 వేల కోట్ల మార్కెట్‌‌ను అందుకున్న ఈ ఇండస్ట్రీ 70 రోజుల లాక్‌‌డౌన్‌‌తో తీవ్రంగా నష్టపోయింది.  ఇండస్ట్రీలో 70 లక్షలకు పైగా ప్రొఫెషనల్స్‌‌పనిచేస్తున్నారని స్కిన్‌‌కేర్‌‌సొల్యూషన్స్‌‌కంపెనీ కాయా లిమిటెడ్‌‌సీఈఓ రాజీవ్‌‌నాయర్‌‌‌‌అన్నారు.

ఇందులో కూడా  ఎక్కువ మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. 70 రోజుల లాక్‌‌డౌన్‌‌తో వీరి జీవనోపాధి పోయిందని అన్నారు. ఇంకో రెండు–మూడు క్వార్టర్‌‌‌‌లో బ్యూటీ, పర్సనల్‌‌కేర్‌‌‌‌ ఇండస్ట్రీ పుంజుకుంటుందని రాజీవ్‌‌అభిప్రాయపడ్డారు.  లాక్‌‌డౌన్‌‌ప్రభావం ఈ ఇండస్ట్రీపై తీవ్రంగా ఉందని, రెవెన్యూ లేకపోయినా కంపెనీలు ఖర్చులను భరించాల్సి వస్తోందని అన్నారు. కొత్తగా సేఫ్టీ రూల్స్‌‌ను ఫాలో అవ్వాల్సి ఉండడంతో షాపులు తిరిగి ఓపెన్‌‌అయిన తర్వాత అదనంగా 7–8 శాతం ఖర్చులు పెరుగుతాయని రాజీవ్‌‌చెప్పారు. గత నెల ఈ ఇండస్ట్రీ ప్రతినిధులతో  ఎంఎస్‌‌ఎంఈ మినిస్టర్‌‌‌‌నితిన్‌‌గడ్కరీ వెబినార్‌‌‌‌లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సెలూన్లకు ఢోకా లేదు..

గత రెండు దశాబ్దాల నుంచి చూస్తే బ్యూటీ, పర్సనల్‌‌కేర్‌‌‌‌ఇండస్ట్రీ రెండంకెల వృద్ధిని సాధించిందని లోఓరియల్‌‌ఇండియా డైరక్టర్‌‌‌‌డీపీ శర్మ అన్నారు. అందాన్ని పెంచుకోవడంపై చాలామందికి ఆసక్తి పెరిగిందని చెప్పారు. ఇది కరోనా వలన పోవడమో లేదా మారడం ఉండదని అభిప్రాయపడ్డారు. రెడ్‌‌క్వాంటా సర్వే ప్రకారం లాక్‌‌డౌన్‌‌టైమ్‌‌లో ప్రజలు ఎక్కువగా మిస్‌‌అయిన మూడు అంశాలలో సెలూన్‌‌ఉందని  శర్మ అన్నారు.  56 శాతం మంది తాము సెలూన్‌‌ను మిస్‌‌అవుతున్నామని చెప్పారని అన్నారు. మిగిలిన వాటితో పోలిస్తే సెలూన్‌‌ఇండస్ట్రీ తొందరగానే తిరిగి పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. బ్యూటీ, పర్సనల్‌‌కేర్‌‌‌‌పై తలసరి ఖర్చు జీడీపీతోపాటే పెరుగుతోంది. ఈ ఇండస్ట్రీలో బ్యూటీ పార్లర్స్‌‌, బార్బర్‌‌‌‌షాపులు, సెలూన్లు, స్పాలు, క్లినిక్స్‌‌, అకడమిక్‌‌ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ఉంటాయి. న్యూ క్వాలిటీ, సేఫ్టీ రూల్స్‌‌ను అమలు చేసేందుకు ఇండస్ట్రీ మొత్తం కలిసి ముందుకొస్తోందని ఎన్‌‌రిచ్‌‌సెలూన్స్‌‌ఫౌండర్‌‌‌‌విక్రమ్‌‌భట్‌‌అన్నారు.

లాక్‌‌డౌన్‌‌తో తీవ్రంగా నష్టపోయాం. తిరిగి కోలుకోవడానికి ఇంకో రెండు నెలలు అయి నా పడుతుంది. ప్రభుత్వం మినహాయిం పులు ఇచ్చింది కానీ క్లయింట్స్‌‌తగ్గారు. మెన్‌‌సెలూన్లు కొంతలో కొంత కోలుకు న్నాయి. విమెన్‌‌బ్యూటీ క్లినిక్‌‌లు ఇంకా పుంజుకోలేదు. లాక్‌‌డౌన్‌‌తో రెవెన్యూ బాగా పడిపోయింది. కొంత మంది ఉద్యోగులను తొలగించాల్సి  వచ్చింది. – ఎవాల్వ్‌‌హెయిర్‌‌‌‌& బ్యూటీ–మేకప్‌‌సెలూన్‌‌, హైదరాబాద్‌‌

షాపులను తెరిచిన 4–5 రోజుల వరకు డిమాండ్ బాగుంది. షేవింగ్‌‌, హెయిర్‌‌‌‌కట్స్‌‌కోసం జనాలు బాగానే వచ్చారు. ప్రస్తుతం కస్టమర్లు రావడం తగ్గింది. ఆగస్టు తర్వాతే తిరిగి సాధారణ స్థాయికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మా ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించలేదు. – మేనీ సెలూన్‌‌, హైదరాబాద్‌‌

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates