రేపటి నుంచి బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఓపెన్

  • పర్మిషన్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ ఆదివారం నుంచి షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవడం తప్పనిసరి అని, షాపులు రోజుకు కనీసం ఐదుసార్లు శానిటైజ్ చేయాలని సూచించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని, అయితే, ఎయిర్ కండిషనింగ్ కు మాత్రం అనుమతి లేదని పేర్కొంది.  ఈ అనుమతులు గ్రేటర్​  చెన్నైతో పాటు కంటైన్ మెంట్ జోన్లకు వర్తించవని స్పష్టం చేసింది. కంటైన్ మెంట్ జోన్లలో నివాసం ఉండేవాళ్లను సెలూన్లలో పనిచేయడానికి అనుమతించకూడదని షాపుల యజమానులకు సూచించింది. అలాగే, కరోనా లక్షణాలు కలిగిన ఏ కస్టమర్​ను షాపులోకి అనుమతించవద్దని చెప్పింది.
బార్బర్స్ నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్లకు సెలూన్లు తిరిగి ఓపెన్ చేసుకునేందు మే 19 న అనుమతించిన పళనిస్వామి ప్రభుత్వం తాజాగా లేడీస్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు ఓపెన్ చేసుకునేందుకు ఓకే చెప్పింది. మే 31 వరకు దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్​డౌన్ అమల్లో ఉంది.

Latest Updates